కబీర్‌ సింగ్‌కు ప్రభాస్‌ ప్రశంసలు

Prabhas is extremely impressed by Shahid Kapoor - Sakshi

‘అర్జున్‌ రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’ టీజర్‌ ఇటీవల రిలీజైంది. కబీర్‌ సింగ్‌గా నటించిన షాహిద్‌ కపూర్‌కు అభినందనలు కురిపిస్తోంది బాలీవుడ్‌. టీజర్‌లో షాహిద్‌ను చూసి మన ‘బాహుబలి’ ప్రభాస్‌ కూడా ఫ్లాట్‌ అయిపోయారట. షాహిద్‌ను పర్సనల్‌గా అభినందించారట కూడా. షాహిద్‌కు, ప్రభాస్‌కు కనె„ý న్‌ ఎక్కడ కుదిరిందీ అనుకుంటున్నారా? ఇద్దరి హైయిర్‌ స్టైలిస్ట్‌ ఒక్కరే. ప్రభాస్‌ ‘సాహో’ సినిమాకు హెయిర్‌ స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు హకీమ్‌ అలీ. షాహిద్‌ పర్సనల్‌ హెయిర్‌ స్టైలిస్ట్‌ కూడా ఇతనే.

‘సాహో’ షూటింగ్‌ టైమ్‌లో ‘కబీర్‌ సింగ్‌’ టీజర్‌ రిలీజ్‌ అయింది. టీజర్‌ చూసిన ప్రభాస్, ‘సాహో’ బృందం చాలా బావుందని మాట్లాడుకోవడం హకీమ్‌ అలీ చెవిలో పడింది. వెంటనే షాహిద్‌కు కాల్‌ చేసి ఫోన్‌ ప్రభాస్‌ చేతిలో పెట్టారట. ‘‘టీజర్‌ చాలా బావుందని  సుమారు 7 నిమిషాల పాటు షాహిద్, ప్రభాస్‌ మాట్లాడుకున్నారు’’ అని హకీమ్‌ అలీ పేర్కొన్నారు. ‘కబీర్‌ సింగ్‌’ జూన్‌ 21న రిలీజ్‌ కానుంది. తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్‌ చేసిన సందీప్‌ రెడ్డి హిందీ రీమేక్‌ను డైరెక్ట్‌ చేశారు. కియారా అద్వానీ హీరోయిన్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top