ఈ నెల 15న 'ప్రభాస్ బాహుబలి' రిలీజ్ | Prabhas Baahubali Releasing Next Week | Sakshi
Sakshi News home page

ఈ నెల 15న 'ప్రభాస్ బాహుబలి' రిలీజ్

Jul 9 2016 10:21 AM | Updated on Oct 30 2018 5:58 PM

ఈ నెల 15న 'ప్రభాస్ బాహుబలి' రిలీజ్ - Sakshi

ఈ నెల 15న 'ప్రభాస్ బాహుబలి' రిలీజ్

బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలలో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆ క్రేజ్ను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న పరభాషా నిర్మాతలు. గతంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన...

బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలలో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆ క్రేజ్ను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న పరభాషా నిర్మాతలు. గతంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమాలను ఇప్పుడు డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కొంత మంది నిర్మాతలు మరో అడుగు ముందుకేసి బాహుబలి పేరును కూడా మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.

అదే బాటలో 2010లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన డార్లింగ్ సినిమాను ఇప్పుడు డబ్ చేసి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను ఏకంగా 'ప్రభాస్ బాహుబలి' అని టైటిల్ పెట్టేశారు. ఇప్పటికే బాహుబలి సినిమా అదే పేరుతో తమిళనాట ఘనవిజయం సాధించింది. దీంతో ఆ పేరుకు ముందు ప్రభాస్ అని అతికించి కొత్త సినిమాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాను జూలై 15న రిలీజ్ చేస్తున్నారు.

ప్రభాస్ సరసన కాజల్ హీరోయిన్గా నటించిన డార్లింగ్ సినిమాకు కరుణాకరన్ దర్శకుడు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ సంగీతం అందించిన ఈ సినిమా తమిళ నాట కూడా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు. మరి ఈ ప్లాన్స్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement