గురి తప్పకూడదు! | Prabhas and Anushka Shetty are ready for spectacular war | Sakshi
Sakshi News home page

గురి తప్పకూడదు!

Jan 26 2017 11:37 PM | Updated on Aug 11 2019 12:52 PM

గురి తప్పకూడదు! - Sakshi

గురి తప్పకూడదు!

‘‘తప్పకూడదు... మన గురి తప్పకూడదు. ఎదుట ఉన్నది ఎవరైనా గురి తప్పకూడదు’’

‘‘తప్పకూడదు... మన గురి తప్పకూడదు. ఎదుట ఉన్నది ఎవరైనా గురి తప్పకూడదు’’... అని అమరేంద్ర బాహుబలి (ప్రభాస్‌) దేవసేన (అనుష్క)కు చెబుతున్నట్టుంది కదూ. ‘బాహుబలి 2’ లోని ఈ స్టిల్‌ను గురువారం విడుదల చేశారు.  మొదటి భాగంలో డీ–గ్లామరైజ్డ్‌ రోల్‌లో దర్శనమిచ్చిన అనుష్క ఈ పోస్టర్‌లో గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. సెకండ్‌ పార్ట్‌లో అమరేంద్ర, దేవసేన ఎలా కనిపిస్తారో ఈ స్టిల్‌ ద్వారా చిత్రబృందం చూపించింది.

కచ్చితంగా ప్రభాస్‌ అభిమానులను ఆనందపరిచే స్టిల్‌ అని చెప్పొచ్చు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ ముఖ్య పాత్రల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 28న విడుదల కానుంది. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement