అనుష్క గురించి ప్రభాస్..! | Prabhas About Bhaagamatie teaser | Sakshi
Sakshi News home page

అనుష్క గురించి ప్రభాస్..!

Dec 20 2017 2:31 PM | Updated on Dec 20 2017 2:33 PM

Prabhas About Bhaagamatie teaser - Sakshi

స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో భాగమతి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను చిత్రయూనిట్ బుధవారం రిలీజ్ చేశారు. థ్రిల్లింగ్ విజువల్స్ తో రూపొందించిన భాగమతి టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పలు సినీ ప్రముఖులు అనుష్క పాత్రల ఎంపికపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ టీజర్ పై స్పందించిన హీరో ప్రభాస్, అనుష్కను ఆకాశానికెత్తేశాడు. ‘ప్రతీ సినిమాలోనూ కొత్తదనం చూపించేందుకు ప్రయత్నించే వారిలో అనుష్క ముందుంటుంది. స్వీటీతో పాటు యువి క్రియేషన్స్ యూనిట్ కు శుభాకాంక్షలు’ అంటూ తన సోషల్ మీడియా పేజ్ లో భాగమతి టీజర్ తో పాటు కామెంట్ చేశాడు బాహుబలి ప్రభాస్.

Advertisement
 
Advertisement
Advertisement