పవర్‌ఫుల్ టైగర్ | powerful tiger | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్ టైగర్

Mar 4 2015 11:31 PM | Updated on Sep 2 2017 10:18 PM

పవర్‌ఫుల్ టైగర్

పవర్‌ఫుల్ టైగర్

‘బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్..! కోల్‌కతా కాళీఘాట్‌లో ఏసీపీగా డ్యూటీ చేస్తోంది’’ అనే డైలాగ్ వినబడగానే మనకు...

‘‘బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్..! కోల్‌కతా కాళీఘాట్‌లో ఏసీపీగా డ్యూటీ చేస్తోంది’’ అనే డైలాగ్ వినబడగానే మనకు గుర్తొచ్చేది ‘పవర్ ’ చిత్రం లో రవితేజ పోషించిన బలదేవ్ సహాయ్ పాత్ర. ఇప్పుడా ‘బెంగాల్ టైగర్’ టైటిల్‌తో రవితేజ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘రచ్చ' ఫేం సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా, రాశీఖన్నా కథానాయికలు. ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఓ ప్రధాన పాత్రధారి.

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆర్.ఎఫ్.సీలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. బొమన్ ఇరానీ, సాయాజీ షిండేలతో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ రవితేజతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇప్పటికి ఆ కోరిక తీరుతోంది. రవితేజ పాత్రను చాలా శక్తిమంతంగా డిజైన్ చేశాం. ఈ నెల 14 వర కు షెడ్యూల్ కొనసాగుతుంది’’అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement