పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు | Power star pawan kalyan next project details | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు

Jan 30 2016 8:34 AM | Updated on Jul 6 2019 4:09 PM

పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు - Sakshi

పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు

ప్రస్తుతం సర్థార్ గబ్బర్సింగ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, తన నెక్ట్స్ సినిమా విషయంలో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. స్టార్ హీరోలందరూ వరుస...

ప్రస్తుతం సర్థార్ గబ్బర్సింగ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, తన నెక్ట్స్ సినిమా విషయంలో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. స్టార్ హీరోలందరూ వరుస సినిమాలతో హవా చూపిస్తుంటే పవన్ మాత్రం సినిమాకు సినిమాకు మధ్యలో భారీ గ్యాప్ తీసుకుంటూ అభిమానులను నిరాశపరుస్తున్నాడు. ప్రస్తుతం సర్థార్ గబ్బర్సింగ్ షూటింగ్ ముగింపు దశలో ఉండటంతో పవర్ స్టార్ చేయబోయే నెక్ట్స్ సినిమాపై టాక్ మొదలైంది.

ఇప్పటి వరకు పవన్ టీం నుంచి ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాకపోయినా, పవన్తో ఖుషి లాంటి బ్లాక్ బస్టర్, కొమరం పులి లాంటి డిజాస్టర్ అందించిన ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడన్న వార్త, ప్రముఖంగా వినిపించింది. అంతేకాదు అజిత్ హీరోగా నటించిన తమిళ సూపర్ హిట్ సినిమా వీరంను పవన్ తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడన్న వార్త తాజాగా వినిపిస్తోంది. వీటికి తోడు గోపాల గోపాల ఫేం కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడట. మరి ఈ మూడు సినిమాలో పవన్, ఏ సినిమాకు కమిట్ అవుతాడో తెలియక అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు తికమక పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement