'సరైనోడు'కు పాజిటివ్ రివ్యూ | Positive Reviews From FDFS to Sarrainodu | Sakshi
Sakshi News home page

'సరైనోడు'కు పాజిటివ్ రివ్యూ

Apr 22 2016 10:10 AM | Updated on Jul 23 2019 11:50 AM

'సరైనోడు'కు పాజిటివ్ రివ్యూ - Sakshi

'సరైనోడు'కు పాజిటివ్ రివ్యూ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'సరైనోడు' సినిమా ఈరోజు విడుదలలైంది.

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'సరైనోడు' సినిమా ఈరోజు విడుదలలైంది. ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పలువురు సినిమా తారలు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పారు. 'సరైనోడు' బాక్సాఫీస్ ను షేక్ చేయాలంటూ చిత్రయూనిట్ కు దగ్గుబాటి రానా శుభాకాంక్షలు తెలిపారు. రకుల్ ప్రీత్ కు ప్రత్యేకంగా 'ఆల్ ది బెస్ట్' చెప్పారు. ఈ ఉదయమే ముంబై వెళుతున్నందున్న మొదటిరోజే సినిమా చూడలేకపోతున్నానని రానా ట్విటర్ ల్లో పేర్కొన్నాడు.

రానాకు కు రకుల్ థ్యాంక్స్  చెప్పింది. మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా 'సరైనోడు' టీమ్ కు ట్విటర్ ద్వారా విషెష్ చెప్పారు. కోలీవుడ్ లో 'సరైనోడు' సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయని రకుల్ ప్రీత్ ట్వీట్ చేసింది. 'సరైనోడు' సూపర్ గా ఉందని అభిమానులు చెబుతున్నారు. ఈ సినిమా విజయవంతం అవుతుందని టీమ్ మొత్తం దీమాగా ఉంది. అల్లు అర్జున్ ను కొత్త తరహాలో చూపించానని దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement