రాజశేఖర్తో కమల్ హాసన్ హీరోయిన్ | Pooja Kumar With RajaSekhar | Sakshi
Sakshi News home page

రాజశేఖర్తో కమల్ హాసన్ హీరోయిన్

Aug 12 2016 9:54 AM | Updated on Sep 4 2017 9:00 AM

రాజశేఖర్తో కమల్ హాసన్ హీరోయిన్

రాజశేఖర్తో కమల్ హాసన్ హీరోయిన్

విశ్వరూపం, ఉత్తమ విలన్ లాంటి చిత్రాల్లో లోకనాయకుడు కమల్ హాసన్ సరసన హీరోయిన్గా నటించిన ఓ హాట్ బ్యూటి తెలుగు సినిమాలో నటించేందుకు అంగీకరించింది. అది కూడా చాలా రోజులుగా సరైన సక్సెస్ లేక...

విశ్వరూపం, ఉత్తమ విలన్ లాంటి చిత్రాల్లో లోకనాయకుడు కమల్ హాసన్ సరసన హీరోయిన్గా నటించిన ఓ హాట్ బ్యూటి తెలుగు సినిమాలో నటించేందుకు అంగీకరించింది. అది కూడా చాలా రోజులుగా సరైన సక్సెస్ లేక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ హీరో రాజశేఖర్ సరసన. లాంగ్ గ్యాప్ తరువాత గడ్డం గ్యాంగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రాజశేఖర్ మరోసారి నిరాశపరిచాడు.

దీంతో ఇక హీరో వేశాలు పక్కన పెట్టి నెగెటివ్ రోల్స్కు కూడా రెడీ అంటూ ప్రకటించేశాడు. అయితే ఒకటి రెండు సినిమాలో విలన్ వేశాలు వచ్చినట్టుగా వార్తలు వినిపించినా అవేవి సెట్స్ మీదకు రాలేదు. అయితే చందమామ కథలు, గుంటూరు టాకీస్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న ప్రవీణ్ సత్తార్ రాజశేఖర్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో రాజశేఖర్ ను యాంగ్రీ పోలీస్ ఆఫీసర్గా చూపించనున్నట్టుగా ప్రకటించాడు డైరెక్టర్. అంతేకాదు ఈ సినిమాలో రాజశేఖర్కు జోడిగా పూజ కుమార్ను ఫైనల్ చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్ స్క్రీన్ మీద కొత్త కనిపిస్తుందని.. ఆ లుక్ సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement