మళ్లీ పనిలో పడ్డా | pooja hegde return to from new york on new year celebrations | Sakshi
Sakshi News home page

మళ్లీ పనిలో పడ్డా

Jan 22 2019 3:24 AM | Updated on Aug 22 2019 9:35 AM

pooja hegde return to from new york on new year celebrations - Sakshi

పూజా హెగ్డే

న్యూ ఇయర్‌ బ్రేక్‌ను పూర్తి చేసి మళ్లీ షూటింగ్స్‌ బిజీలో పడిపోయారు పూజా హెగ్డే. న్యూ ఇయర్స్‌ సెలబ్రేషన్స్‌ కోసం ఈ బ్యూటీ న్యూయార్క్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. పదిహేను రోజుల పాటు పనికి ఫుల్‌స్టాప్‌ పెట్టి హాలిడేస్‌ను ఎంజాయ్‌ చేశారు. హాలీవుడ్, హ్యారీపోటర్‌ షూటింగ్‌ చేసిన ప్రదేశాలన్నీ చుట్టేశారు. రీసెంట్‌గా హాలిడేస్‌ను పూర్తి చేసిన పూజ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ప్రభాస్‌తో చేస్తోన్న లవ్‌స్టోరీ సెట్లో జాయిన్‌ అయ్యారామె. ‘‘లాంగ్‌ హాలిడే తర్వాత ఈ ఏడాది మళ్లీ కెమెరా ముందుకు వచ్చాను. హాలిడే మూడ్‌ వదిలేసి మళ్లీ పనిలో పడ్డా’’ అని పేర్కొన్నారు పూజా హెగ్డే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 1920ల కాలంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జాన్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఎక్కువ శాతం షూటింగ్‌ ఇటలీలో జరుపుకోనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో థియేటర్స్‌లోకి రానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement