డబుల్‌ ధమాకా | Pooja Hegde may have teamed up with Nithiin for Srinivas Kalyanam | Sakshi
Sakshi News home page

డబుల్‌ ధమాకా

Jan 5 2018 12:31 AM | Updated on Aug 22 2019 9:35 AM

Pooja Hegde may have teamed up with Nithiin for Srinivas Kalyanam - Sakshi

బడిలో గుడిలో.. మడిలో నీ తలపే శశివదన.. అంటూ ‘డీజే’ సినిమాలో అగ్రహారం కుర్రాడు అల్లు అర్జున్నే కాకుండా తెలుగు రాష్ట్రాల అబ్బాయిలందరితో తన నామ జపం చేయించారు పూజా హెగ్డే. ఆ మాటకొస్తే ‘ముకుందా’లో ‘గోపికమ్మా.. చాలునులేమ్మా..’ అంటూ కుర్రకారు గుండెలకు గేలం వేశారు. ప్రతి సినిమాకీ అభినయంతో పాటు గ్లామర్‌తో మంచి మార్కులు కొట్టేస్తున్నారు. ఇప్పుడు వరుసగా ఆఫర్లూ కొట్టేస్తున్నారు ఈ భామ. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సరసన ‘సాక్ష్యం’ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నారు.

ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందనున్న సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే పేరునే ఖరారు చేసిందట చిత్రబృందం. ఇది మహేశ్‌ కెరీర్‌లో 25వ చిత్రం. ఈ సినిమాను అశ్వినీ దత్, ‘దిల్‌’ రాజు నిర్మించనున్నారు. మరో సినిమాకి కూడా పూజ పేరు పరిశీలనలో ఉంది. ‘శతమానం భవతి’ సినిమాతో దర్శకుడిగా మారిన సతీష్‌ వేగేశ్న తదుపరి సినిమా ‘శ్రీనివాస కల్యాణం’లో  హీరోయిన్‌గా చాలా పేర్లు పరిశీలించినప్పటికి ‘దిల్‌’ రాజు టీమ్‌ పూజా హెగ్డే పేరునే ఫైనల్‌ చేసినట్టు సమాచారం. పైన చెప్పిన రెండు సినిమాల్లో పూజా నటిస్తే.. ‘దిల్‌’ రాజు సారథ్యంలో ఆమె త్రీ మూవీస్‌ చేసినట్లవుతుంది. ఒకేసారి రెండు సినిమాలకు ఓ హీరోయిన్‌ పేరుని పరిశీలిస్తున్నారంటే.. కచ్చితంగా అది ఆమెకు డబుల్‌ ధమాకానే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement