మరో చాన్స్‌ కొట్టేసిన బుట్ట బొమ్మ! | Pooja Hegde May Get A Chance In Akshay Kumar Movie | Sakshi
Sakshi News home page

మరో చాన్స్‌ కొట్టేసిన బుట్ట బొమ్మ!

Mar 22 2020 2:09 PM | Updated on Mar 22 2020 2:32 PM

Pooja Hegde May Get A Chance In Akshay Kumar Movie - Sakshi

‘అల వైకుంఠపుములో’ సినిమాతో హిట్‌ అందుకున్న ‘బుట్ట బొమ్మ’ పూజా హెగ్డే మరో బాలీవుడ్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసినట్టు సమాచారం. ఇప్పటికే సల్మాన్‌ఖాన్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’లో ఆమె నటిస్తుండగా. తాజాగా అక్షయ్‌ కుమార్‌ హీరోగా  ఫర్హాద్ షామ్జీ దర్శకత్వంలో వస్తున్న `బచ్చన్ పాండే`సినిమాలోనూ పూజా హీరోయిన్‌గా సెలక్ట్ చేసినట్టు సమాచారం. అయితే ఇందులో మెయిన్ హీరోయిన్‌గా కృతి సనన్ నటిస్తుండగా రెండో కథానాయికగా పూజాని ఎంపిక చేశారట. ఇటీవల ‘హౌజ్‌ఫుల్‌-4’ చిత్రంలో నటించిన పూజా బాలీవుడ్‌ జనాలను అలరించారు. ఈ చిత్రాలతో బాలీవుడ్ ఆమె క్రేజీ హీరోయిన్ కాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. కాగా, తెలుగులో టాప్‌ హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా కొనసాగుతున్న పూజా ప్రస్తుతం  ప్రభాస్‌ సరసన ‘జాన్‌', అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రంలో నటిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement