పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

Pooja Hegde Charging Huge Remuneration For 10 Days Shoot - Sakshi

సినీరంగంలో డిమాండ్‌ ఉన్న తారలను తీసుకునేందుకు ఎంత పారితోషికం ఇచ్చేందుకైన సిద్ధమవుతున్నారు మన మేకర్స్‌. క్రేజ్‌, లక్కీ హ్యాండ్ అన్న అంచనాలతో తారలు ఎంత అడిగిన కాదనకుండా ముట్టజెపుతున్నారు. తాజాగా పూజా హెగ్డే పారితోషికం విషయంలోనూ ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ లో వరుసగా టాప్‌ హీరోల సరసన నటిస్తూ మంచి ఫాంలో ఉన్న ఈ భామను ఓ మీడియం రేంజ్‌ సినిమాలో నటింప చేసుందుకు ట్రై చేస్తున్నారు. అంతేకాదు కేవలం పది రోజుల కాల్షిట్స్‌ కోసం ఏకంగా కోటిన్నర ఆఫర్ చేసిన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. హరీష్ శంకర్‌ దర్శకత్వంలో వరుణ్ తేజ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా వాల్మీకి. ఈ సినిమాలో ఓ సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాల్లో నటించేందుకు పూజా హెగ్డే కోటీ యాబై లక్షల రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top