గేమ్‌ ఆడుతుంటే టైమ్‌ తెలియదు | Playing the game does not know the time | Sakshi
Sakshi News home page

గేమ్‌ ఆడుతుంటే టైమ్‌ తెలియదు

Jun 6 2018 12:19 AM | Updated on Jun 6 2018 6:11 AM

Playing the game does not know the time - Sakshi

‘‘చాలా ప్రాబ్లమ్స్‌ నుంచి డిస్‌కనెక్ట్‌ కావడానికి వీడియో గేమింగ్‌ సులువైన పద్ధతి. గేమ్‌ ఆడుతుంటే టైమ్‌ తెలీదు. గేమింగ్, టెక్నాలజీ కలిసి అందించే అనుభవాలను ఎంజాయ్‌ చేయడానికి అందరూ ఇష్టపడతారు. డ్యూ ఎరీనాతో నా అనుబంధం ప్రారంభమైన నాటి నుంచి ఈ–స్పోర్ట్స్‌ గురించి చాలా తెలుసుకున్నాను. డ్యూ ఎరీనా థర్డ్‌ ఎడిషన్‌ గురించి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాను’’ అన్నారు అక్కినేని అఖిల్‌. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సాఫ్ట్‌ డ్రింక్‌ ‘మౌంటెన్‌ డ్యూ’ మూడవ ఎడిషన్‌లో భాగంగా  డ్యూ ఎరినా గేమింగ్‌ను నగరవాసులకు పరిచయం చేసారు. ఈ సందర్భంగా అఖిల్‌ మాట్లాడుతూ– ‘‘నా చిన్నతనంలో నాన్న (నాగార్జున)గారితో కలిసి గేమ్‌ ప్లే చేసేవాణ్ణి.

చిన్నప్పుడు ఎక్కువగా చదవమనేవారు కానీ ఇప్పుడు గేమింగ్‌ అనేది అఫీషియల్‌గా మారింది. వీడియో గేమింగ్‌ను ఏషియన్‌ గేమ్స్‌లో చేర్చారని విన్నా. అందుకు హ్యాపీ. వీడియో గేమ్స్‌ ఆడేవారికి నేషనల్‌ స్థాయిలో మంచి ప్లాట్‌ఫామ్‌ దొరికింది. వాళ్లను చూస్తుంటే ఈర్ష్యగా ఉంది. దేశంలో యువతకు గేమింగ్‌ పట్ల ఆసక్తి పెంచడానికి మౌంటెన్‌ డ్యూ కృషి చేస్తోంది. ఇలాంటి గేమ్స్‌ రూపొందించడం ద్వారా భారతీయ గేమర్లు తమ సృజనను, ప్రతిభను ఆవిష్కరించుకోవచ్చు. ఇందులో భాగంగా కౌంటర్‌ స్టైక్, డోటా–2 గేమ్‌లు ఆన్‌లైన్‌లో, రాకెట్‌లీగ్, స్ట్రీట్‌ఫైట్‌ గేమ్‌లు ఆన్‌గ్రౌండ్‌ గేమింగ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తాయి.  మౌంటెన్‌ డ్యూ కంపెనీతో భాగస్వామ్యం కావడం హ్యాపీగా ఉంది. ఈ థర్డ్‌ ఎడిషన్‌ గేమింగ్‌లో త్రీ ఫామ్స్‌ ఉంటాయి. ఫస్ట్‌... గేమింగ్‌ ట్రక్‌ 10 రాష్ట్రాల్లో 83 నగరాల్లోని 270 ప్రాంతాలలో పర్యటిస్తుంది. సెకండ్‌ ఫేజ్‌ ఆన్‌లైన్‌. థర్డ్‌ మీ మొబైల్‌. విన్నర్స్‌ 20 లక్షల నగదు బహుమతిని గెలుచుకునే అవకాశం ఉంది. విజేతలుగా నిలిచే అభ్యర్థుల చిత్రాలను లిమిటెడ్‌ ఎడిషన్‌ మౌంటెన్‌ డ్యూ బాటిల్స్‌పై ముద్రిస్తారు.

అక్టోబర్‌ 2018లో గ్రాండ్‌ ఫైనల్‌ జరుగుతుంది’’ అన్నారు. ఇంకా అఖిల్‌ మాట్లాడుతూ– ‘‘నాకు మౌంటెన్‌ డ్యూ అంటే ఎందుకు ఇంత ఇష్టం అంటే.. అవుట్‌డోర్‌ స్పోర్ట్స్‌ నుంచి వీడియోగేమ్‌ వరకు అన్నింటినీ ప్రోత్సహిస్తారు. వాళ్లు కేవలం డ్రింక్‌ను మాత్రమే ప్రమోట్‌ చేయడం లేదు. ఒక లైఫ్‌ స్టైల్‌ను ప్రమోట్‌ చేస్తున్నారు. మౌంటెన్‌ డ్యూ యాడ్స్‌ వాళ్ల క్యాంపెయినింగ్, ఐడియాస్‌ అన్నీ నాకు ఇష్టం. వాళ్లు ఏ ఐడియా తెచ్చినా నాకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మొన్న చేసిన యాడ్‌ నుంచి ఇంతకుముందు చేసిన యాడ్‌తో పాటు క్యాంపెయినింగ్‌ అంతా నాకు ఆసక్తికరంగా ఉంటుంది. వీళ్లతో నాకు అసోసియేషన్‌ హ్యాపీ. రీసెంట్‌గా చేసిన ఎరీనా నుంచి ఇంతకుముందు చేసిన మనాలి షూట్‌ వరకు సూపర్‌’’ అన్నారు. ఇంకా పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మరిన్ని వివరాలకు www.dewarena.com   వెబ్‌సైట్‌ సందర్శించి, మౌంటెన్‌ డ్యూ ఫేస్‌బుక్‌ పైజీపై అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement