– దర్శకుడు వేణు ఊడుగుల
‘‘ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా కథ రాసుకున్నాడు సాయిలు. ప్రేమతో కూడిన విషాద భరితమైన ఈ సంఘటన ఆ ఊర్లోనే జరిగి, అక్కడే సమాధి అయ్యింది. ఎంటర్‌టైనింగ్‌గా, మాస్ అప్పీల్ ఉండేలా సాయిలు ఈ స్క్రిప్ట్ రాశాడు. ‘7/జీ బృందావన్ కాలనీ, ప్రేమిస్తే, ఆర్‌ఎక్స్ 100, బేబీ’ చిత్రాల్లా ‘రాజు వెడ్స్ రాంబాయి’ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఇక నా దర్శకత్వంలోని సినిమాకు యూవీ క్రియేషన్స్ సంస్థలో ప్రీ ్ర΄÷డక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని దర్శక–నిర్మాత వేణు ఊడుగుల అన్నారు.
అఖిల్, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని నవంబరు 21న రిలీజ్ చేస్తున్నట్లుగా యూనిట్ ప్రకటించింది. వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ సినిమాను థియేట్రికల్‌గా రిలీజ్ చేస్తున్నారు. ‘‘ఈ సినిమా చూశాక ప్రేక్షకులు ఓ ఎమోషనల్ ఫీల్‌తో థియేటర్స్ నుంచి బయటకొస్తారు’’ అని అన్నారు బన్నీ వాసు. ‘‘ఒకే ఒక నరేషన్‌లో వేణుగారు మా సినిమాను ఓకే చేశారు’’ అన్నారు సాయిలు. ‘‘ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇందులోని నటీనటులను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తు పెట్టుకుంటుంది’’ అని చెప్పారు వంశీ నందిపాటి.


