పదేళ్ల తర్వాత నా లైఫ్‌ మారబోతుంది : అఖిల్‌ | Actor Akhil Raj Says Raju Weds Rambai Movie Changing His Life | Sakshi
Sakshi News home page

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రంతో నా లైఫ్‌ మారుతుంది : అఖిల్‌

Nov 19 2025 1:21 PM | Updated on Nov 19 2025 1:34 PM

Actor Akhil Raj Says Raju Weds Rambai Movie Changing His Life

‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో పదేళ్లుగా ఉంటున్న నాకు సరైన బ్రేక్‌ రాలేదు. ఆ కష్టానికి తగిన ఫలితం ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ (Raju Weds Rambai) సినిమా తీసుకొస్తుందని నమ్ముతున్నా. ఈ సినిమా రిలీజైన రోజు నుంచి నా జీవితం మారిపోతుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రంలో నేను చేసిన రాజు పాత్ర ప్రతి అబ్బాయికి కనెక్ట్‌ అవుతుంది’’ అని హీరో అఖిల్‌ రాజ్‌(Akhil Raj) చెప్పారు. 

సాయిలు కంపాటి దర్శకత్వంలో అఖిల్‌ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్‌ రాంబాయి’. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 21న విడుదల చేస్తున్నారు.

తేజస్విని మాట్లాడుతూ ‘‘రాంబాయి క్యారెక్టర్‌కు నేను సరిపోతానని ఎంపిక చేశారు. తెలంగాణ యాసలో మాట్లాడేందుకు సాయిలుగారు సపోర్ట్‌ చేశారు. ఈ సినిమా క్లైమాక్స్‌ షూట్‌ చేస్తున్నప్పుడు నేను భావోద్వేగానికి గురయ్యా. చిత్రాన్ని 7 జీ బృందావన్ కాలని, ప్రేమిస్తే, బేబి, సైరత్ వంటి కల్ట్ మూవీస్ తో పోల్చుకోవచ్చు. 

ఆ చిత్రాల్లాగే మా సినిమా కూడా కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంటుంది. ఈ నెల 21న మా మూవీ చూసి థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ఆడియెన్స్ కూడా మేము ఇలా ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకుంటారు. రియలిస్టిక్ ఇన్సిడెంట్ ఆధారంగా సినిమా రూపొందించినా కొంత సినిమాటిక్ లిబర్టీ కూడా మూవీలో ఉంటుందిఅన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement