4న పిచ్చైకారన్ | pichai karan release on 4th march | Sakshi
Sakshi News home page

4న పిచ్చైకారన్

Feb 13 2016 3:49 AM | Updated on Oct 8 2018 7:35 PM

4న పిచ్చైకారన్ - Sakshi

4న పిచ్చైకారన్

పిచ్చైక్కారన్ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోనీ కథానాయకడిగా నటించి తన విజయ్‌ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం పిచ్చైకారన్.

పిచ్చైక్కారన్ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోనీ కథానాయకడిగా నటించి తన విజయ్‌ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం పిచ్చైకారన్. నవ నటి సత్నాటైట్స్ కథానాయకిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని శశి నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర విడుదల హక్కుల్ని స్కైలార్క్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థతో కలిసి కేఆర్ ఫిలింస్ అధినేతలు పొందారు. ఆ పంపిణీదారుల్లో ఒకరైన శరవణన్ చిత్ర విడుదల గురించి వెల్లడిస్తూ ప్రస్తుతం తమిళ చిత్రపరిశ్రమ టైమ్ బాంగుందన్నారు. మంచి కథా చిత్రాలు విడుదలై విజయం సాధిస్తున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది తమ లాంటి డిస్ట్రిబ్యూటర్లకు ప్రోత్సాహకరమైన పరిస్థితి అని పేర్కొన్నారు.

పిచ్చైక్కారన్ వంటి కథాబలం ఉన్న చిత్రం కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం తమకుందన్నారు. ఈ చిత్ర కథానాయకుడు విజయ్‌ఆంటోనికి ఇటు ప్రేక్షకుల్లోనూ అటు థియేటర్ల యజమానుల్లోనే ఆదరణ ఉందన్నారు. అది ఈ పిచ్చైకారన్ విజయానికి తోడ్పడుతుందనే నమ్మకం ఉందన్నారు. శశికి దర్శకుడిగా మంచి పేరుందని అది ఈ చిత్రంతో రెట్టింపు అవుతుందన్నారు. ఈ చిత్రాన్ని మార్చి 4న రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర డిస్ట్రిబ్యూటర్ శరవణన్ వెల్లడించారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement