మూడు తరాల అనుబంధం | PC Aditya New Movie Started | Sakshi
Sakshi News home page

మూడు తరాల అనుబంధం

Oct 19 2013 12:35 AM | Updated on Aug 28 2018 4:30 PM

మూడు తరాల అనుబంధం - Sakshi

మూడు తరాల అనుబంధం

కుటుంబమంటే ఒక ఇల్లు కాదు... ఒక ఊరు కాదు... వ్యవస్థ అని తెలిపే సందేశాత్మక కథాంశంతో ఓ చిత్రం రూపొందుతోంది. పి.సి. ఆదిత్య దర్శకుడు. శ్రీఅమ్మా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బి.రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగిన పూజాకార్యక్రమంతో ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ -‘‘కుటుంబాలలో అడుగంటిపోతున్న అనుబంధాలు, ఆత్మీయతల్ని ఒక్కసారి గుర్తు చేసే కథాంశమిది. గ్రామీణ వాతావరణంలో కథ సాగుతుంది. 
 
మూడు తరాలకు చెందిన ఈ కుటుంబకథలో తాతగా ఎపిక్యురస్ నాగరాజు నటిస్తుండగా, కొడుకుగా నేనే నటిస్తున్నాను. మనవడిగా కొత్త నటుణ్ని పరిచయం చేస్తున్నాం. నవంబర్ తొలివారం నుంచి హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ నిర్వహిస్తాం’’ అని తెలిపారు.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement