బుల్‌ బుల్‌ పాయల్‌

Payal Rajput special song in 'SITA'  - Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్‌ క్రియేట్‌ చేశారు పాయల్‌ రాజ్‌పుత్‌. అందం, అభినయంతో యువతని అలరించిన ఈ బ్యూటీ కథానాయికగా బిజీగా ఉన్నా ప్రత్యేక గీతాల్లో నటిస్తున్నారు. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘సీత’ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు పాయల్‌. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.

ఈ పాటలో భాగంగా ఆర్‌ఎక్స్‌ 100 బైక్‌పై చిరునవ్వులు చిందిస్తూ, వయ్యారాలు వొలకబోస్తున్న పాయల్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. ‘‘సినిమా కథానుసారం కీలక సమయంలో వచ్చే ‘బుల్‌ రెడ్డి...’ అనే పెప్పీ మాస్‌ సాంగ్‌లో పాయల్‌ న టించారు. ఈ పాట మాస్‌తో సహా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. ఈ పాటలో పాయల్‌ సోలో పెర్ఫామెన్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఈ పాటని రిలీజ్‌ చేస్తున్నాం.

ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్‌ 2.5 మిలియన్‌ వ్యూస్‌తో సూపర్‌ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. సోనూ సూద్, తనికెళ్ల భరణి, అభినవ్‌ గోమటం, అభిమన్యుసింగ్‌ నటించిన ఈ చిత్రానికి సమర్పణ: ఏ టీవీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికపాటి, సహ నిర్మాతలు: అజయ్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్, సంగీతం: అనూప్‌ రూబెన్స్, కెమెరా: శిర్షా రే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top