పవన్ మరో సినిమా మొదలెట్టేశాడు | Pawan, trivikram movie launched | Sakshi
Sakshi News home page

పవన్ మరో సినిమా మొదలెట్టేశాడు

Nov 5 2016 2:15 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ మరో సినిమా మొదలెట్టేశాడు - Sakshi

పవన్ మరో సినిమా మొదలెట్టేశాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ ఫాంలో ఉన్నాడు. సర్థార్ గబ్బర్ సింగ్ ఫెయిల్యూర్ తో ఆలోచనలో పడ్డ పవర్ స్టార్ ఇప్పుడు వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ ఫాంలో ఉన్నాడు. సర్థార్ గబ్బర్ సింగ్ ఫెయిల్యూర్ తో ఆలోచనలో పడ్డ పవర్ స్టార్ ఇప్పుడు వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు పవన్. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో ఏఎమ్ రత్నం నిర్మించే సినిమాను కొద్ది రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ రోజు(శనివారం) మరో సినిమాను కూడా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు పవన్. చాలా రోజులుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్ సినిమా ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను ఈ రోజు రామానాయుడు స్టూడియోస్లో లాంఛనంగా ప్రారంభించారు. అతి కొద్ది మంది మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా సమాచారం. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కాటమరాయుడు షూటింగ్ పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement