
పవన్ నిర్మాతగా నితిన్ సినిమా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో నితిన్ల అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. తన సొంతం సినిమా ఫంక్షన్లకైనా మిస్ అవుతాడేమో కాని నితిన్ సినిమా ఫంక్షన్కు పవన్ ఎప్పుడూ మిస్...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో నితిన్ల అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. తన సొంతం సినిమా ఫంక్షన్లకైనా మిస్ అవుతాడేమో కాని నితిన్ సినిమా ఫంక్షన్కు పవన్ ఎప్పుడూ మిస్ అవ్వడూ. నితిన్ కూడా తన ప్రతీ సినిమాలో ప్రస్థావన తేకుండా ఉండడు. ఎన్నో వేదికల మీద పవర్ స్టార్ తన అభిమాన హీరో అని ప్రకటించాడు నితిన్. అందుకే నితిన్ సినిమాలకు పవన్ అభిమానులు కూడా అండగా ఉంటూ వస్తున్నారు.
నితిన్ తన మీద చూపిస్తున్న అభిమానానికి బదులు తీర్చుకునేందుకు రెడీ అవుతున్నాడు పవర్ స్టార్. ఇప్పటికే నితిన్ సినిమా ఫంక్షన్లకు హాజరవుతూ ఈ యంగ్ హీరోను సపోర్ట్ చేస్తున్న పవన్, త్వరలోనే నితిన్ హీరోగా తన సొంత బ్యానర్లో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం 14 రీల్స్ బ్యానర్ లో హనురాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న నితిన్, ఆ తరువాత పవన్ నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.