హిందీ రిపోర్టర్కు పవన్ గిఫ్ట్ | pawan kalyans gift to bollywood reporter ajay brahmatmaj | Sakshi
Sakshi News home page

హిందీ రిపోర్టర్కు పవన్ గిఫ్ట్

Mar 22 2016 2:38 PM | Updated on Mar 22 2019 5:33 PM

హిందీ రిపోర్టర్కు పవన్ గిఫ్ట్ - Sakshi

హిందీ రిపోర్టర్కు పవన్ గిఫ్ట్

లాంగ్ గ్యాప్ తరువాత సర్దార్ గబ్బర్సింగ్గా వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ సినిమాతో సరికొత్త రికార్డ్లు క్రియేట్ చేయాలని భావిస్తున్నాడు.

లాంగ్ గ్యాప్ తరువాత సర్దార్ గబ్బర్సింగ్గా వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ సినిమాతో సరికొత్త రికార్డ్లు క్రియేట్ చేయాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో మీడియాకు దూరంగా ఉండే పవన్, ఈ సారి మాత్రం ప్రముఖ చానల్స్కు ఇంటర్య్యూలు ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. అంతేకాదు తొలిసారిగా సర్దార్ గబ్బర్సింగ్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెడుతున్న పవన్ కళ్యాణ్, అక్కడ కూడా ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నాడు.

ఇప్పటికే బాలీవుడ్ ఫిలిం రిపోర్టర్ అనుపమ చోప్రాకు సర్దార్ సెట్లోనే ఇంటర్వ్యూ ఇచ్చిన పవన్, మరో హిందీ విలేకరి  అజయ్ బ్రహ్మత్మజ్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా అజయ్కి పవన్ ఓ మెమొరబుల్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన అజయ్, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతేకాదు తన చేసిన ఇంటర్య్వూ జాగరన్ న్యూస్లో పబ్లిష్ అయిన విషయాన్ని కూడా తన ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేశారు అజయ్ బ్రహ్మత్మజ్.

 

Advertisement
 
Advertisement
Advertisement