పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ అ​కౌంట్‌ హ్యాక్‌! | pawan kalyan twitter account got hacked | Sakshi
Sakshi News home page

ప్రముఖ హీరో ట్విట్టర్‌ అ​కౌంట్‌ హ్యాక్‌!

May 17 2017 8:57 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ అ​కౌంట్‌ హ్యాక్‌! - Sakshi

పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ అ​కౌంట్‌ హ్యాక్‌!

జనసేన అధ్యక్షుడు, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌కు గురైంది.

హైదరాబాద్‌ : జనసేన అధ్యక్షుడు, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌ అయింది.  హ్యాకర్లు ఆయన అకౌంట్‌ను హ్యాక్‌ చేసి, పాస్‌వర్డ్‌ కూడా మార్చేశారు. గత మూడు రోజుల నుంచి ఆయన ట్విట్టర్‌ అకౌంట్‌కు అంతరాయం ఏర్పడింది. అయితే సాంకేతిక లోపం వల్లే తన అకౌంట్‌లో సమస్య ఏర్పడిందని పవన్‌ భావించారట. అయితే ఇవాళ ఆయన ట్విట్టర్‌ అకౌంట్‌ పూర్తిగా స్తంభించడంతో ...ఐటీ నిపుణులతో సంప్రదిస్తున్నారు. మరోవైపు ట్విట‍్టర్‌ హ్యాక్‌ అయిన విషయంపై పవన్‌ ...అభిమానులను అప్రమత్తం చేశారు. మే 8న పవన్‌ చివరిసారిగా ట్విట్‌ చేశారు.

మరోవైపు పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ పని చేయడం లేదని జనసేన పార్టీ అధికారికంగా ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన చేసింది. ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌ చేసి ఉండవచ్చని, నిపుణుల చేత సంప్రదించిన తర్వాత మిగతా వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జనసేన హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement