పవన్ సినిమా వాయిదా..? | Pawan Kalyan Trivikram srinivas movie postponed | Sakshi
Sakshi News home page

పవన్ సినిమా వాయిదా..?

Jun 11 2017 10:44 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ సినిమా వాయిదా..? - Sakshi

పవన్ సినిమా వాయిదా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఘనవిజయం సాధించటంతో రాబోయే సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ గత చిత్రాలు సర్థార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు లు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో కొత్త సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ ఈ సెప్టెంబర్లోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ కావటం లేదని తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం కావటంతో పాటు రాజకీయ కారణాలతో నెల రోజులు పాటు పవన్ షూటింగ్కు బ్రేక్ ఇవ్వనున్నాడట. దీంతో సినిమాను వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ముందుగా అనుకున్నట్టుగా దసరాకు కాకుండా సినిమాను దీపావళి లేదా డిసెంబర్ నెలల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాదిలోనే సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారట.

Advertisement
 
Advertisement
Advertisement