గబ్బర్సింగ్ డైరెక్టర్కి మరో ఛాన్స్ | Pawan kalyan to work with Harish Shankar | Sakshi
Sakshi News home page

గబ్బర్సింగ్ డైరెక్టర్కి మరో ఛాన్స్

May 25 2016 10:34 AM | Updated on Mar 22 2019 5:33 PM

గబ్బర్సింగ్ డైరెక్టర్కి మరో ఛాన్స్ - Sakshi

గబ్బర్సింగ్ డైరెక్టర్కి మరో ఛాన్స్

దాదాపు పుష్కర కాలం పాటు ఒక్క హిట్ కూడా లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను తిరిగి ఫాంలోకి తీసుకు వచ్చిన సినిమా గబ్బర్సింగ్.

దాదాపు పుష్కర కాలం పాటు ఒక్క హిట్ కూడా లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను తిరిగి ఫాంలోకి తీసుకు వచ్చిన సినిమా గబ్బర్సింగ్. పవన్ మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన ఈ సినిమాతో దర్శకుడు హరీష్ శంకర్ కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ తరువాత చేసిన రామయ్య వస్తారవయ్య డిజాస్టర్ కావటంతో సీన్ రివర్స్ అయ్యింది. హరీష్కి అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రామయ్య వస్తావయ్య ఫ్లాప్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న హరీష్, సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో సక్సెస్ సాధించాడు. అదే జోరులో ఇప్పుడు పవన్ కళ్యాణ్తో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఎస్ జె సూర్య దర్శకత్వంలో హుషారు(వర్కింగ్ టైటిల్) లో నటిస్తున్న పవన్, ఆ తరువాత దాసరి నిర్మాతగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు.

ఈ సినిమాతో పాటు తనకు ఖుషి లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన ఏఎం రత్నం బ్యానర్లో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు రత్నం. ఇప్పటికే పవర్ స్టార్ కోసం ఓ లైన్ వినిపించిన హరీష్, ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement