ఆ రీమేక్‌లో పవన్ కల్యాణ్? | Pawan Kalyan to reprise Ajith in Telugu remake of Veeram | Sakshi
Sakshi News home page

ఆ రీమేక్‌లో పవన్ కల్యాణ్?

May 2 2016 6:55 PM | Updated on Mar 22 2019 5:33 PM

ఆ రీమేక్‌లో  పవన్ కల్యాణ్? - Sakshi

ఆ రీమేక్‌లో పవన్ కల్యాణ్?

ఏ సినిమా అయినా పెట్టిన పెట్టుబడికి మూడింతలు వసూలు చేస్తే... తీసినవాళ్లు, కొన్నవాళ్లు పండగ చేసుకుంటారు. ఇక.. ఆ సినిమాలో నటించినవాళ్లు,

 ఏ సినిమా అయినా పెట్టిన పెట్టుబడికి మూడింతలు వసూలు చేస్తే... తీసినవాళ్లు, కొన్నవాళ్లు పండగ చేసుకుంటారు. ఇక.. ఆ సినిమాలో నటించినవాళ్లు, పనిచేసినవాళ్ల ఆనందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాదిన్నర క్రితం తమిళ పరిశ్రమలో ఇలాంటి ఒక చిత్రం విడుదలైంది. పేరు ‘వీరమ్’. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో దాదాపు 40 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం 120 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. ఇప్పుడీ చిత్రం గురించిన ప్రస్తావన ఎందుకంటే.. ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటించనున్నారట.
 
 ఇటీవల ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా ఆరంభమైన విషయం తెలిసిందే. దీనికి శరత్ మరార్ నిర్మాత. ఈ చిత్రం ‘వీరమ్’కి రీమేక్ అని సమాచారం. ఇది యాక్షన్ బేస్డ్ లవ్ డ్రామా. కొన్ని నెలల క్రితం ఈ చిత్రబృందం ‘వీరమ్’ హక్కులు తీసుకుందట. అప్పట్నుంచీ తెలుగుకి అనుగుణంగా కథలో మార్పులూ, చేర్పులూ చేయడం మొదలుపెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘వీరమ్’ని యథాతథంగా తీయరట. జస్ట్ స్టోరీలైన్ మాత్రమే అదనీ, మిగతాదంతా వేరే విధంగా ఉంటుందనీ వినికిడి.
 
 వాస్తవానికి పవన్-ఎస్.జె. సూర్యల సినిమా ప్రారంభోత్సవం నాడు ఈ చిత్రానికి ఆకుల శివ కథ అందిస్తున్నారని ప్రకటించారు. మరి.. ‘వీరమ్’ కథనే శివ వర్కవుట్ చేసి ఉంటారా? లేక వేరే కథ అయ్యుంటుందా? ఒకవేళ వేరే కథ అయితే.. ‘వీరమ్’ని వేరే దర్శకుడితో చేయడానికి పవన్ కల్యాణ్ ప్లాన్ చేస్తున్నారా? అనే విషయాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement