పవన్ బ్యానర్లో మరో మెగా హీరో | Pawan Kalyan to produce Sai Dharam tej Film | Sakshi
Sakshi News home page

పవన్ బ్యానర్లో మరో మెగా హీరో

Mar 4 2017 2:56 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ బ్యానర్లో మరో మెగా హీరో - Sakshi

పవన్ బ్యానర్లో మరో మెగా హీరో

ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతగానూ బిజీ అయ్యేందుకు

ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతగానూ బిజీ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తన సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించే పవర్ స్టార్, గతంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను నిర్మించనున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఆ ప్రాజెక్ట్ ఇంత వరకు పట్టాలెక్కలేదు. ఇటీవల తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి నితిన్ హీరోగా ఓ సినిమాను ప్రారంభించాడు.

అదే బాటలో ఇప్పుడు మరిన్ని చిన్న చిత్రాలను లైన్లో పెట్టే ప్లాన్లో ఉన్నాడు పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాలను నిర్మించనున్నాయి. ముందుగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. విన్నర్ సినిమాతో నిరాశపరిచిన సాయి ప్రస్తుతం బివియస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా తరువాత వేరే ఏ ప్రాజెక్ట్కు కమిట్ కాలేదు. దీంతో సరైన కథ, దర్శకుడు దొరికితే పవన్ బ్యానర్ లోనే సాయి ధరమ్ సినిమా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే హీరోగా, జనసేన అధినేతగా ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్, ఇప్పుడు నిర్మాతగానూ హవా చూపించేందుకు రెడీ అవుతున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement