సేనాపతి హల్ చల్! | Pawan Kalyan New Movie Senapathi Poster | Sakshi
Sakshi News home page

సేనాపతి హల్ చల్!

May 3 2016 10:23 PM | Updated on Mar 22 2019 5:33 PM

సేనాపతి హల్ చల్! - Sakshi

సేనాపతి హల్ చల్!

అభిమాన హీరో సినిమా మొదలైందంటే చాలు అభిమానులు పండగ చేసుకుంటారు. ఆ ఆనందంలో ఆ సినిమాకి...

అభిమాన హీరో సినిమా మొదలైందంటే చాలు అభిమానులు పండగ చేసుకుంటారు. ఆ ఆనందంలో ఆ సినిమాకి ఏవేవో టైటిల్స్ పెట్టేస్తారు. పాత ఫొటోలతో ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసేస్తారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ అభిమానులు అదే చేశారు. ఆయన హీరోగా ఎస్.జె. సూర్య దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం ఇటీవల ఆరంభమైన విషయం తెలిసిందే. ఇది తమిళ ‘వీరమ్’కి రీమేక్ అనే వార్త ఆ తర్వాత ప్రచారంలోకొచ్చింది. కానీ, చిత్రబృందం మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. తాజాగా.. ఈ చిత్రానికి ‘సేనాపతి’ అనే టైటిల్ అనుకుంటున్నారనే మరో వార్త ప్రచారంలోకొచ్చింది.

ఈ టైటిల్‌తో ఓ పోస్టర్ డిజైన్ చేసి, ఎవరో సామాజిక మాధ్యమంలోకి వదిలారు. అంతే.. కాసేపటికే ఆ పోస్టర్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేయడం మొదలుపెట్టింది. చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ కాదు కాబట్టి, ఈ టైటిల్ నిజం కాదని అర్థమవుతోంది. మరి.. అసలు టైటిల్ ఏంటి? ఒకవేళ ఆ నోటా ఈ నోటా ఈ టైటిల్ పెట్టాలని దర్శక-నిర్మాతలు అనుకుంటున్నారని తెలిసే అభిమానులు పోస్టర్ డిజైన్ చేశారా? అన్నది తెలియడానికి ఎంతో కాలం పట్టదు.

Advertisement
 
Advertisement
Advertisement