కాటమరాయుడు ముందే వస్తాడా..? | Pawan Kalyan Katamarayudu release preponed | Sakshi
Sakshi News home page

కాటమరాయుడు ముందే వస్తాడా..?

Jan 31 2017 1:55 PM | Updated on Mar 22 2019 5:33 PM

కాటమరాయుడు ముందే వస్తాడా..? - Sakshi

కాటమరాయుడు ముందే వస్తాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా కాటమరాయుడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్గా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా కాటమరాయుడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకుడు. గబ్బర్సింగ్ సినిమాతో హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్న పవన్, శృతి హాసన్లు ఈ సినిమాలో మరోసారి జోడి కడుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చని ఈ సినిమాను మార్చి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ముందుగా ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం కాటమరాయుడు సినిమాను మరోవారం ముందుగా అంటే మార్చి 24నే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మార్చి 15 వరకు చాలా మంది పిల్లలకు పరీక్షలు అయిపోతాయన్న ఆలోచనతో సినిమాను ప్రీపోన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. కాటమరాయుడు ముందే వస్తున్నాడన్న వార్తతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement