‘మనం’, ‘దృశ్యం’ తరహాలో... | Pasanga 2 Becomes Memu | Sakshi
Sakshi News home page

‘మనం’, ‘దృశ్యం’ తరహాలో...

Dec 1 2015 11:45 PM | Updated on Sep 3 2017 1:19 PM

‘మనం’, ‘దృశ్యం’ తరహాలో...

‘మనం’, ‘దృశ్యం’ తరహాలో...

సినిమా సినిమాకు విభిన్న తరహా పాత్రలు పోషించి, ప్రేక్షకులను ఆకట్టుకునే కథానాయకుడు సూర్య.

సినిమా సినిమాకు విభిన్న తరహా పాత్రలు పోషించి, ప్రేక్షకులను ఆకట్టుకునే కథానాయకుడు సూర్య. అందుకే ఆయనకు తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులున్నారు. సూర్య హీరోగా నటిస్తూ పాండిరాజ్ దర్శకత్వంలో తమిళంలో నిర్మించిన చిత్రం - ‘పసంగ 2’. ఈ చిత్రాన్ని సాయి సూర్య, కె.ఇ. జ్ఞానవేల్ రాజా సమర్పణలో మణికంఠ పిక్చర్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి తెలుగులో ‘మేము’ పేరుతో అనువదిస్తున్నారు. ఈ నెలాఖరున ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇటీవల సూర్య విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘మనం’, ‘దృశ్యం’ సినిమాల తరహాలో మా చిత్రం ఘన విజయం సాధిస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ‘పిశాచి’ చిత్ర ఫేమ్ అరోల్ కొరెల్లి, పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్, సాహితి, సహ నిర్మాతలు: ప్రసాద్ సన్నితి, తమటం కుమార్‌రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement