పరుచూరి బ్రదర్స్‌కు జీవిత సాఫల్య పురస్కారం

paruchuri brothers lifetime achievement award - Sakshi

మే 4న  దర్శకరత్న డా. దాసరి నారాయణరావు 75వ జయంతి. ఈ సందర్భంగా అంతర్జాతీయ సాంస్కృతిక సాహితీ సేవాసంస్థ వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ ఇంటర్నేషనల్, రేలంగి నరసింహారావు చైర్మన్‌గా ఏర్పడిన డా. దాసరి– వంశీ జీవిత సాఫల్య పురస్కారం కమిటీలు ఈ నెల 10న ప్రముఖ సినీరచయితలు పరుచూరి బ్రదర్స్‌ (పరుచూరి వెంకటేశ్వరరావు పరుచూరి గోపాలకృష్ణ)కు జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటారని వంశీ వ్యవస్థాపక అధ్యక్షులు వంశీ రామరాజు పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top