మా జాగ్రత్తలు ఫలించలేదు

 Parineeti Chopra Injured While Training for Saina Nehwal biopic - Sakshi

‘సైనా’ చిత్రానికి బ్రేకుల మీద బ్రేకులు పడుతున్నాయి. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా బాలీవుడ్‌ దర్శకుడు అమోల్‌ గుప్తా ‘సైనా’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలి సిందే. తొలుత ఈ సినిమాలో సైనా పాత్రకు శ్రద్ధాకపూర్‌ను ఎంపిక చేశారు. చిత్రీకరణ కూడా ప్రారంభించారు. శ్రద్ధాకు ఆరోగ్యం బాగోలేకపోవడం, ప్రాక్టీస్‌ సమయంలో గాయపడటం, డేట్స్‌ క్లాష్‌ అవ్వడం.. ఇలా పలు కారణాలతో ‘సైనా’ చిత్రం నుంచి శ్రద్ధాకపూర్‌ తప్పుకున్నారు.

ఆ తర్వాత సైనా నెహ్వాల్‌ పాత్ర చేయడానికి పరిణీతి చోప్రా పచ్చజెండా ఊపారు. ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టారు. చిత్రీకరణ మొదట్లోనే పరిణీతి చోప్రా గాయపడటం చిత్రబృందాన్ని కలవరపెడుతోంది. ‘‘బ్యాడ్మింటన్‌ సాధనలో భాగంగా గాయపడకూడదని నేనూ, చిత్ర బృందం చాలా జాగ్రత్తలు వహించాం. కానీ, మా జాగ్రత్తలు ఫలించలేదు. నేను గాయపడ్డాను. కోలుకొని త్వరలో చిత్రీకరణలో పాల్గొనాలని ఉంది’’ అన్నారు పరిణీతి చోప్రా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top