ప్యారిస్‌లో పద్మావతి! | Padmavati to have a grand release Paris! | Sakshi
Sakshi News home page

ప్యారిస్‌లో పద్మావతి!

Oct 21 2017 12:01 AM | Updated on Oct 21 2017 8:52 AM

Padmavati to have a grand release Paris!

అక్టోబర్‌ 9. సమయం... మధ్యాహ్నం ఒంటి గంటా మూడు నిమిషాలు. జస్ట్‌ ఓ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. అంతే.. యూట్యూబ్‌లో లక్షల మంది చూశారు. ఒక్కసారి చూసి, వన్స్‌మోర్‌ అనకుండా ఉండలేమనీ, పాత రికార్డులన్నీ చెరిగిపోతాయనీ అన్నారు.

‘పద్మావతి’ సినిమా ట్రైలర్‌కు అంత రెస్పాన్స్‌ వచ్చింది. దీపికా పదుకొనె, షాహిద్‌కపూర్, రణ్‌వీర్‌సింగ్‌ ముఖ్య తారలుగా సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంతో రూపొందుతోన్న చిత్రమిది. రాణీ పద్మావతి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 1న విడుదల చేయాలనుకుంటున్నారు. ప్యారిస్‌లో కూడా భారీగా రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట.

అంతేకాదు ఫ్రెంచ్‌లో సబ్‌ టైటిల్స్‌ కూడా వేస్తారట. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలోనే 2002లో వచ్చిన ‘దేవదాస్‌’ చిత్రాన్ని ప్యారిస్‌లో పెద్ద ఎత్తున విడుదల చేయగా... మంచి స్పందన లభించింది. ఇప్పుడు ‘పద్మావతి’పైన అంచనాలున్నాయి. మరి.. ఇటు ఇండియాలో అటు విదేశాల్లో ‘పద్మావతి’ అంచనాలను చేరుకుంటుందా? వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement
 
Advertisement
Advertisement