ఇలాంటి చిత్రం... గ్యారంటీ హిట్టు! | Padesave first look launch | Sakshi
Sakshi News home page

ఇలాంటి చిత్రం... గ్యారంటీ హిట్టు!

Jan 22 2016 10:59 PM | Updated on Jul 15 2019 9:21 PM

ఇలాంటి చిత్రం... గ్యారంటీ హిట్టు! - Sakshi

ఇలాంటి చిత్రం... గ్యారంటీ హిట్టు!

పునాది బలంగా ఉంటేనే బిల్డింగ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. నాన్నగారు స్థాపించిన స్కూలులో, అన్నపూర్ణా స్టూడియోస్ సంస్థలో...

- నాగార్జున  
‘‘పునాది బలంగా ఉంటేనే బిల్డింగ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. నాన్నగారు స్థాపించిన స్కూలులో, అన్నపూర్ణా స్టూడియోస్ సంస్థలో అనేక చిత్రాలకు చునియా పని చేసింది. ఆమె దర్శకత్వం వహించిన సినిమా కావడంతో నేను ప్రమోట్ చేయాలనుకున్నా’’ అని హీరో అక్కినేని నాగార్జున అన్నారు. కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, శ్యామ్ ప్రధాన పాత్రలో నాగార్జున ప్రోత్సాహంతో అయాన్ క్రియేషన్స్ పతాకంపై చునియా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పడేశావే’ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘యూత్ లవ్‌లోని ఇష్టాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. అనూప్ మంచి సంగీతం అందించాడు. ఇలాంటి సినిమా తీస్తే గ్యారంటీ  హిట్టవుతుంది. సినిమా చూసి చిరునవ్వుతో బయటికొస్తారు’’ అని నాగా ర్జున అన్నారు.

‘‘నేను సీరియల్ డెరైక్ట్ చేస్తున్నప్పుడు చునియా నా వద్ద జాయిన్ అయింది. తర్వాత రాజమౌళి, ఆ తర్వాత నాగార్జున వద్ద వర్క్ చేసింది. డెరైక్టర్‌గా మంచి పేరు సంపాదించాలి’’ అని దర్శకులు రాఘవేంద్రరావు పేర్కొన్నారు. ‘‘నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రాఘవేంద్రరావుగారు, నాగార్జున గారే. ‘మనం’ చిత్ర సమయంలో నాగార్జున గారికి ఈ కథ వినిపించా. ఆయనకు నచ్చడంతో షూటింగ్ స్టార్ట్ చేసి, పూర్తి చేశాను. ఈ నెల 26న పాటలను విడుదల చేస్తాం’’ అని దర్శకురాలు చునియా తెలి పారు. సంగీత దర్శకుడు అనూప్, హీరో కార్తీక్ రాజు, హీరోయిన్ నిత్యాశెట్టి చిత్రబృందం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement