మంచీ చెడు | Pa Vijay Aaruthra Telugu Movie gets u certificate | Sakshi
Sakshi News home page

మంచీ చెడు

Feb 13 2020 5:53 AM | Updated on Feb 13 2020 5:53 AM

Pa Vijay Aaruthra Telugu Movie gets u certificate - Sakshi

పా విజయ్‌

రచయిత, నటుడు, దర్శక–నిర్మాత పా. విజయ్‌ ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆరుద్ర’. మరో ప్రముఖ నటుడు కె. భాగ్యరాజా కీలక పాత్ర పోషించారు. మేఘాలీ, దక్షిత, సోని, సంజన సింగ్‌ హీరోయిన్లుగా నటించారు. తమిళంలో ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ చిత్రాన్ని జె.ఎల్‌.కె. ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత కె.వాసుదేవరావు అదే పేరుతో తెలుగులోకి అనువదించారు. సెన్సార్‌ పనులు పూర్తయ్యాయి. క్లీ¯Œ  యు సర్టిఫికెట్‌ అందుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నారు.

కె.వాసుదేవరావు మాట్లాడుతూ– ‘‘సామాజిక ఇతివృత్తంతో రూపొందిన చిత్రమిది. తల్లిదండ్రులు, పిల్లలకు మంచి సందేశం ఇచ్చారు. ఆడ పిల్లలపై జరుగుతున్న అమానుష చర్యలకు ప్రతీకార దిశగా ఈ చిత్రం ఉంటుంది. గుడ్‌ అండ్‌ బ్యాడ్‌ టచ్‌ గురించి అందరికీ అర్థమయ్యేలా చక్కగా చూపించారు. తమిళంలో మంచి వసూళ్లు రాబట్టింది. యూనివర్సల్‌ కాన్సెప్ట్‌ కావడంతో  తెలుగులోకి అనువదిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: వరకాంతం సునీల్‌ రెడ్డి. 

Advertisement
 
Advertisement
Advertisement