యాక్షన్‌ ఆక్సిజన్‌ | oxygen movie songs released shortly | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ ఆక్సిజన్‌

Aug 29 2017 12:25 AM | Updated on Sep 17 2017 6:03 PM

యాక్షన్‌ ఆక్సిజన్‌

యాక్షన్‌ ఆక్సిజన్‌

గోపీచంద్, రాశీఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆక్సిజన్‌’.

గోపీచంద్, రాశీఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆక్సిజన్‌’. ఏ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. ఐశ్వర్య నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. ఎస్‌. ఐశ్వర్య మాట్లాడుతూ– ‘‘పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. గోపీచంద్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బడ్జెట్‌ మూవీ. ఇందులో ఆయన చాలా హ్యాండసమ్‌గా కనిపిస్తారు.

ముంబై, గోవా, సిక్కిం, చెన్నై లాంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. జ్యోతికృష్ట టేకింగ్‌ విలువలు సినిమా రిలీజయ్యాక ప్రేక్షకులకు అర్థమవుతాయి. యువన్‌ శంకర్‌ రాజా చక్కని పాటలిచ్చారు. ఈ పాటలు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. త్వరలో పాటలు విడుదల చేసి, అక్టోబర్‌ 12న సినిమాని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. జగపతిబాబు, ‘కిక్‌’ శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, అమిత్, సితార తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వెట్రి–ఛోటా కె. నాయుడు, పాటలు: శ్రీమణి–రామజోగయ్య శాస్త్రి.

Advertisement
 
Advertisement
Advertisement