‘ఆయనకు నేను.. నాకు ఆయన’

oviya acts with dance master Raghava Lawrence

సాక్షి, చెన్నై : ఆయనకు నేను, నాకు ఆయన అంటోంది నటి ఓవియ. బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొన్న తరువాత ఈ అమ్మడి క్రేజే వేరు. కొన్ని చిత్రాలలో హీరోయిన్‌గా నటించినా రాని పాపులారిటీ బిగ్‌బాస్‌ గేమ్‌ షోతో వచ్చి పడింది. దీంతో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం లారెన్స్‌తో ఆయన తాజా చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది ఓవియ.

అయితే ఈ బ్యూటీ గురించి చాలా గాసిప్స్‌ ప్రచారంలో ఉన్నాయి. ఆమెతో పాటు ‘బిగ్‌బాస్‌’లో పాల్గొన్న ఆరవ్‌తో కలిపి వదంతులు హోరెత్తుతున్నాయి. వీటి గురించి ఇటీవల ఒక టీవీకి ఇచ్చిన భేటీలో ఓవియ వివరణ ఇచ్చారు. తనకు చాలా అవకాశాలు వస్తున్న మాట నిజమేననీ, అయితే ఒకే సమయంలో అన్ని చిత్రాలు సాధ్యం కాదనీ పేర్కొంది.

తాను ఆదాయం కోసం ప్రయత్నించి మోడలింగ్‌ రంగంలోకి వెళ్లానని, ఆ తరువాత కళవాణి చిత్రంలో నటించే అవకాశం రావడంతో సినీరంగానికి పరిచయం అయ్యాననీ ఆమె తెలిపింది. ప్రస్తుతం తాను లారెన్స్‌తో చేస్తున్న చిత్రాన్నే అంగీకరించాననీ చెప్పింది. ఇక నటుడు ఆరమ్‌తో ప్రేమ వ్యవహారంపై జరుగుతున్న ప్రచారం గురించి స్పందించింది. తనకు ఒక పార్టనర్‌ ఉన్నాడనీ, ఆయనకు తాను, తనకు ఆయన అంటూ తెలివిగా బదులిచ్చి ఆయన ఎవరన్నది చెప్పకుండానే వెళ్లిపోయింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top