హీరోయిన్‌కు షాక్‌ ఇచ్చిన రజనీకాంత్

Only Nayanthara In Rajinikanth And Murugadoss Film Not Keerthy Suresh - Sakshi

అనుకున్నవన్నీ జరగవు. అనుకోనివి జరగకమానవు. ఇదే జీవితం. సరిగ్గా నటి కీర్తీసురేశ్‌ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఈ వర్ధమాన నటి మహానటి సావిత్రిగా నటిస్తానని ఊహించి ఉండదు. కానీ అది జరిగింది. ఆ చిత్రం కీర్తీసురేశ్‌ నటన జీవితంలో కలికితరాయిగా నిలిచిపోయేలా అమరింది. కీర్తీసురేశ్‌ గురించి రాసినా, మాట్లాడినా మహానటి ప్రస్తావన లేకుండా ఉండదు. అలాంటి నటికి కోలీవుడ్‌లో సూపర్‌ చాన్స్‌ వచ్చినట్లే వచ్చి చేజారిపోయ్యిందనే విషయం తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

కీర్తి అవకాశానికి సూపర్‌స్టారే అడ్డం పడ్డారని టాక్‌స్ప్రెడ్‌ అయ్యింది. రజనీకాంత్‌ ప్రస్తుతం దర్బార్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నయనతార కథానాయకిగా నటిస్తోంది. ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం ముంబైలో ప్రారంభం అయ్యింది. ఈ మూవీలో ముందుగా రజనీకాంత్‌కు జంటగా దర్శకుడు మురుగదాస్‌ నటి కీర్తీసురేశ్‌నే ఎంపిక చేశారట.

అయితే రజనీకాంత్‌ హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేయమని చెప్పడంతో దర్శకుడు మురుగదాస్‌కు మరో దారి లేక ఆమెనే ఎంపిక చేసినట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది. కీర్తీసేరేశ్‌ తనకు జంటగా సెట్‌ అవ్వదని రజనీకాంత్‌ చెప్పారట. అలా ఆయన కీర్తీసురేశ్‌కు అడ్డుపడ్డారన్నమాట. ఇకపోతే  నటి నయనతార ఇప్పటికే రజనీకాంత్‌తో రెండు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించడంతో ఆమె తనకు జంటగా బాగుంటుందని రజనీకాంత్‌ అభిప్రాయపడ్డారట.

అలా కోలీవుడ్‌లో సూపర్‌ చాన్స్‌ను కోల్పోయిన కీర్తీసురేశ్‌కు టాలీవుడ్‌లో మాత్రం మెగా చాన్స్‌ లభించినట్లు తెలుస్తోంది. అవును త్వరలో ఈ చిరునవ్వుల చిన్నది చిరంజీవికి జంటగా నటించబోతోందనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం మళయాళం, తెలుగు చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో బాలీవుడ్‌లో అడుగు పెట్టడానికి రెడీ అవుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top