పూజ లవ్స్‌ శ్రీనివాస్‌ | One Crore Offer to Pooja Hegde for Bellamkonda Srinivas Film | Sakshi
Sakshi News home page

పూజ లవ్స్‌ శ్రీనివాస్‌

Jun 28 2017 11:04 PM | Updated on Aug 3 2019 12:45 PM

పూజ లవ్స్‌ శ్రీనివాస్‌ - Sakshi

పూజ లవ్స్‌ శ్రీనివాస్‌

ప్రేమలో పడ్డామనే ఊహే ఎంతో అందంగా ఉంటుంది కదూ! అలాంటప్పుడు ఎప్పుడూ ప్రేమ పల్లకీల్లో విహరించే హీరోయిన్లు మరింత అందంగా ఉండాలా?

ప్రేమలో పడ్డామనే ఊహే ఎంతో అందంగా ఉంటుంది కదూ! అలాంటప్పుడు ఎప్పుడూ ప్రేమ పల్లకీల్లో విహరించే హీరోయిన్లు మరింత అందంగా ఉండాలా? లేదా? చూస్తేనే కుర్రకారు ప్రేమలో పడేలా ఉండాలి కదూ! రీసెంట్‌ టైమ్స్‌లో కుర్రకారును అంతలా ప్రేమలో దించిన హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారంటే పూజా హెగ్డేనే. ‘డీజే దువ్వాడ జగన్నాథమ్‌’లో పూజా అందం ప్రేక్షకులను ప్రేమలో పడేలా చేసింది. వాళ్లను అలా పడేసి... ఈ ముద్దుగుమ్మ మాత్రం మరొకరితో ప్రేమలో పడింది.

 అతనెవరంటే... బెల్లంకొండ శ్రీనివాస్‌. వీళ్లు ప్రేమలో పడింది దర్శకుడు శ్రీవాస్‌ కోసం! అంటే... రియల్‌ లైఫ్‌లో కాదు, రీల్‌ లైఫ్‌లో అన్నమాట! బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో అభిషేక్‌ నామా నిర్మిస్తున్న సినిమాలో పూజా హెగ్డేను కథానాయికగా ఎంపికగా చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ముగిసింది. త్వరలో ప్రారంభం కానున్న సెకండ్‌ షెడ్యూల్‌లో పూజ పాల్గొంటారని నిర్మాత తెలిపారు. ఇందులో ఆమె మరింత అందంగా కనిపిస్తారని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి యాక్షన్‌: పీటర్‌ హెయిన్స్, మ్యూజిక్‌: దేవిశ్రీ ప్రసాద్‌.

Advertisement
 
Advertisement
Advertisement