రాజుగారు మళ్లీ వస్తున్నారు | Omkar partners with Prasad for 'Raju Gari Gadhi 2' | Sakshi
Sakshi News home page

రాజుగారు మళ్లీ వస్తున్నారు

Aug 26 2016 12:14 AM | Updated on Sep 4 2017 10:52 AM

రాజుగారు మళ్లీ వస్తున్నారు

రాజుగారు మళ్లీ వస్తున్నారు

‘‘గతేడాది చిన్న చిత్రంగా రిలీజై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది ‘రాజుగారి గది’. ఈ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు ఓంకార్.

రాజుగారి గది 2 , ఓంకార్ ,పొట్లూరి వి. ప్రసాద్
 ‘‘గతేడాది చిన్న చిత్రంగా రిలీజై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది ‘రాజుగారి గది’. ఈ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు ఓంకార్. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ ఏడాది ‘క్షణం’, ‘ఊపిరి’ లాంటి విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థ పీవీపీ. ‘రాజుగారి గది 2’ని నిర్మించడానికి ఈ సంస్థ అధినేత పొట్లూరి వి. ప్రసాద్ ముందుకొచ్చారు.

ఈ సీక్వెల్‌కి అగ్ర నిర్మాణ సంస్థ తోడవడంతో భారీ తారాగణంతో పాటు మంచి టెక్నిషియన్లను కూడా తీసుకుంటున్నామని దర్శకుడు ఓంకార్ అన్నారు. మొదటి భాగంకన్నా రెండో భాగం ఇంకా క్వాలిటీగా ఉంటుందన్నారు. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఓక్ ఎంటర్ టైన్‌మెంట్స్ నిర్మించనున్నాయి. పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కవిన్ అన్నే నిర్మాతలు.

 

Advertisement
 
Advertisement
Advertisement