నటనలో, అందంలో ఈ నలుగురూ నలుగురే. సుమారు ముప్ఫై ఏళ్లుగా దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారు. 90వ దశకంలో నువ్వా నేనా అన్నట్లు పోటాపోటీగా సినిమాలు చేశారు. అప్పట్లో అగ్ర హీరోయిన్లు ఎవరు? అనడిగితే... ఊర్వశి, రాధిక, ఖుష్బూ, సుహాసిని.. ఈ నలుగురి పేర్లూ తప్పకుండా వినిపించేవి. వీళ్ల మధ్య పోటీ సినిమాల వరకే. మేకప్ తీసేసిన తర్వాత నలుగురూ స్నేహితులే. హెల్దీ కాంపిటీషన్ అనమాట. ఎయిటీస్ రీ-యూనియన్ పేరుతో ప్రతి ఏడాది గెట్ టుగెదర్ పార్టీలు నిర్వహిస్తుంటారు.
ఇప్పుడీ నలుగురి గురించి ప్రస్తావన ఎందుకంటే... వీళ్లంతా కలసి ఓ సినిమాలో నటించనున్నారని చెన్నై కోడంబాక్కమ్ వర్గాల సమాచారం. నలుగురు సీనియర్ హీరోయిన్లు ఓ సినిమాలో నటించడం వింతేముంది? అనుకోవచ్చు. అసలు విషయం ఏంటంటే.. ఈ నలుగురూ కలసి నటిస్తున్న ఫస్ట్ సినిమా ఇది. ఇంకొకటి.. నిజ జీవితంలో స్నేహితులైన వీళ్లు సినిమాలోనూ స్నేహితులుగానే నటించనున్నారు.
జేమ్స్ వసంతన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా హిందీ ‘జిందగీ నా మిలేగీ దొబారా’ తరహాలో ఫన్నీ ఎంటర్టైనర్గా ఉంటుందట. ఈ నలుగురి క్యారెక్టరైజేషన్లను 90వ దశకంలో వాళ్లు నటించిన హిట్ సినిమాల్లోని క్యారెక్టర్స్ ఇన్స్పిరేషన్తో డిజైన్ చేశారట. వచ్చే వారమే ఆస్ట్రేలియాలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని, సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ అంతా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రియల్ లైఫ్‌లో ఈ నలుగురూ స్నేహితులు కావడంతో సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
నలుగురూ స్నేహితులే!
Published Sat, Sep 24 2016 12:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్‌టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్‌తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
తప్పక చదవండి
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
Advertisement