నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

oh baby movie collections update - Sakshi

‘‘నిర్మాణంలో ముగ్గురు, నలుగురు ఇన్వాల్వ్‌ అయినప్పుడు వ్యత్యాసాలు రావడం సహజం. కానీ, మా అందరిలో ఒకరి బలం ఏంటో మరొకరికి తెలుసు. అలా అందరం కలసి సాఫీగా వర్క్‌ చేశాం. మా అందరి రథసారథి సురేశ్‌బాబు’’ అని సునీత తాటి, వివేక్‌ కూచిభొట్ల అన్నారు. సమంత లీడ్‌ రోల్‌లో లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. సురేశ్‌ బాబు, సునీతా తాటి, వివేక్‌ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది.

ఈ సందర్భంగా సునీత తాటి మాట్లాడుతూ– ‘‘ఇంతకు ముందు ‘కొరియర్‌ బాయ్, సాహసం శ్వాసగా సాగిపో’ వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాను. 2017లో ‘ఓ బేబీ’ సినిమా మొదలైంది. ఈ పాత్రకు లక్ష్మీగారు బావుంటారన్నది నందినీరెడ్డి ఐడియా.  రాజేంద్రప్రసాద్‌ లుక్‌ బాగా సెట్‌ అయింది. ఆయన లుక్‌ని అల్లు అర్జున్‌ కూడా బాగా అభినందించారు. ‘ఓ బేబీ’ను హిందీలో రీమేక్‌ చేస్తాం. ఆలియా భట్‌ హీరోయిన్‌ అయితే బాగుంటుందనుకుంటున్నాం. వచ్చే ఏడాది సెట్స్‌ మీదకు వెళ్తుంది. కన్నడ, బెంగాలీలోనూ రీమేక్‌ కోసం అడుగుతున్నారు. చైనాలో రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నాం. ఈ సినిమాను బూసాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు తీసుకెళ్తున్నాం. ఇంత మంచి కథ ఇచ్చినందుకు మేం వాళ్లకు ఇవ్వబోయే గౌరవం అది’’ అన్నారు సునీత.

వివేక్‌ కూచిభొట్ల మాట్లాడుతూ– ‘‘మా సినిమా విడుదలైన తొమ్మిదో రోజు కూడా బుక్‌ మై షోలో ట్రెండింగ్‌లో ఉంది. ఓవర్‌సీస్‌లో కూడా బాగా ఆడుతోంది. సినిమా నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే. ఫిల్మ్‌ మేకింగ్‌ చాలా ఈజీగా అనిపించేట్టు సురేశ్‌బాబు చేశారు. ఆయన సినిమాల్లో ప్రాఫిట్స్‌ ఇచ్చి మాకు పాఠాలు నేర్పారు. ప్రస్తుతం మేం చేస్తున్న ‘వెంకీ మామ’ సినిమా 70శాతం పూర్తయింది. దసరాకు రిలీజ్‌ చేద్దామనుకుంటున్నాం. మా ముగ్గురి కాంబినేషన్‌లో మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. త్వరలోనే వివరాలు చెబుతాం’’ అన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top