నా కెరీర్‌లోనే ఫస్ట్‌ టైమ్‌...: వర్మ

Officer Movie First Song Released - Sakshi

విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, నాగార్జున అక్కినేని కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆఫీసర్‌. ఈ చిత్రం నుంచి తొలి పాటను కాసేపటి క్రితం దర్శకుడు వర్మ ట్విటర్‌లో రిలీజ్‌ చేశారు. తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓ చిన్నపాపపై తాను పాటను రూపొందించానని ఆయన చెబుతున్నారు. ‘నవ్వే నువ్వు నవ్వకపోతే.. అంటూ సాగే సాంగ్‌కు రమ్య బెహరా గాత్రం అందించారు. తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్‌ ఆధారంగా సాగే ఈ పాటను సిరాశ్రీ రచించారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన వర్మకు సిరాశ్రీ థాంక్స్‌ చెప్పగా, తనదైన స్టైల్‌లో వర్మ రిప్లై కూడా ఇచ్చాడు. ఈ చిత్రానికి రవి శంకర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. నాగార్జున, మైరా సరీన్‌, అజయ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఆఫీసర్‌  జూన్‌ 1న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top