ఓ మనసా..! ఎవరికోసం | O Manasa Evarikosam is an upcoming movie | Sakshi
Sakshi News home page

ఓ మనసా..! ఎవరికోసం

Aug 19 2013 1:25 AM | Updated on Sep 1 2017 9:54 PM

ఓ మనసా..! ఎవరికోసం

ఓ మనసా..! ఎవరికోసం

ప్రేమకోసం తీసుకున్న ఓ నిర్ణయం ఓ విద్యార్థి జీవితాన్ని ఎలా బలిగొందనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఓ మనసా...! ఎవరికోసం’. యువకిషోర్, శ్రుతిహుస్సేన్ జంటగా నటిస్తున్నారు.

 ప్రేమకోసం తీసుకున్న ఓ నిర్ణయం ఓ విద్యార్థి జీవితాన్ని ఎలా బలిగొందనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఓ మనసా...! ఎవరికోసం’. యువకిషోర్, శ్రుతిహుస్సేన్ జంటగా నటిస్తున్నారు. అశోక్‌రాజా దర్శకుడు. ఆర్.ఉదయ్‌కుమార్ నిర్మాత. హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. 
 
 ముహూర్తపు దృశ్యానికి నిర్మాత సోదరి హేమ కెమెరా స్విచాన్ చేయగా, ఘంటాడి కృష్ణ క్లాప్ ఇచ్చారు. మురళికృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. వచ్చే నెల తొలి వారంలో రెగ్యులర్ షూటింగ్‌కి వెళతామని నిర్మాత తెలిపారు.
 
 హైదరాబాద్, విశాఖ, భద్రాచలంలో చిత్రీకరణ జరుపుతామని దర్శకుడు చెప్పారు. ఈ సందేశాత్మక చిత్రంలోని ఆరు పాటలూ భిన్నంగా ఉంటాయని సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్రాజు, కథనం: మురళీకృష్ణ.బి, సమర్పణ: శివసాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement