ప్రేమించడానికి అర్హతలేంటి? | Nuvendhuku Nachhave Sailaja Movie Opening | Sakshi
Sakshi News home page

ప్రేమించడానికి అర్హతలేంటి?

Sep 25 2018 4:20 AM | Updated on Sep 25 2018 4:20 AM

Nuvendhuku Nachhave Sailaja Movie Opening - Sakshi

రోషన్, అనూష జంటగా నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నువ్వెందుకు నచ్చావె శైలజ’. అనుపమ ఆర్ట్స్‌ పతాకంపై వి.రామకృష్ణ నిర్మిస్తోన్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్‌ క్లాప్‌ ఇవ్వగా, కొమర వెంకటేశ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కృష్ణమోహన్‌ గౌరవ దర్శకత్వం వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఇదొక యాంటీ లవ్‌ స్టోరీ. ఎలా ప్రేమించాలి.. ఎలా ప్రేమించకూడదన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ప్రేమించాలంటే ఉండాల్సిన అర్హతలను ఇందులో చూపిస్తున్నాం.

నాలుగు పాత్రల మధ్య ఇంట్రెస్టింగ్‌ కథనంతో ఈ సినిమా ఉంటుంది. నేటి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తున్నాం’’ అన్నారు. ‘‘మా తొలి సినిమానే ఇలాంటి మంచి కథతో చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు రోషన్, అనూష.  ‘‘కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నా. మంచి టీమ్‌ కుదిరింది’’ అన్నారు నిర్మాత రామకృష్ణ. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సాయాజీ షిండే, ఆశిష్‌ విద్యార్థి, ధనరాజ్, కాదంబరి కిరణ్, సన, మణిచందన, మణి, సూరజ్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: యం.జోషి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement