అలాంటివారిలో తారక్ ఒకడు- నాగ్ | NTR, The Only Star Gained Stardom In Below 30's - Nagarjuna | Sakshi
Sakshi News home page

అలాంటివారిలో తారక్ ఒకడు- నాగ్

Mar 17 2016 6:34 PM | Updated on Jul 15 2019 9:21 PM

అలాంటివారిలో తారక్ ఒకడు- నాగ్ - Sakshi

అలాంటివారిలో తారక్ ఒకడు- నాగ్

'సోగ్గాడే చిన్ని నాయన' సూపర్ హిట్ అవ్వడంతో మాంచి ఊపు మీదున్న టాలీవుడ్ మన్మధుడు నాగార్జున 'ఊపిరి' తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు.

'సోగ్గాడే చిన్ని నాయన' సూపర్ హిట్ అవ్వడంతో మాంచి ఊపు మీదున్న టాలీవుడ్ మన్మధుడు నాగార్జున 'ఊపిరి' తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఊపిరి సినిమా గురించి మాట్లాడుతూ నాగార్జున.. యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్తీ పాత్రకు ముందుగా ఎన్టీఆర్ ను అప్రోచ్ అయ్యామని,  అతడు కూడా ఊపిరిలో నటించేందుకు ఆసక్తి చూపించారని చెప్పారు. కానీ డేట్స్ సర్దుబాటు అవ్వక తారక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలిపారు.

అయితే తారక్ ను ఆ పాత్రకు ఎంచుకోవడం పూర్తిగా తన నిర్ణయమేనని నాగ్ చెప్పారు. ఇంకా మట్లాడుతూ.. 'నేనెప్పుడూ మా పిల్లలకు కూడా సలహా ఇస్తుంటాను.. మంచి సబ్జెక్ట్స్ ఎంచుకుంటే అవే స్టార్ డమ్ ను తీసుకొచ్చిపెడతాయని. అయినా 30 ఏళ్ల లోపు స్టార్ డమ్ అందుకున్న నటులు చాలా అరుదు, అలాంటివారిలో తారక్ ఒకడు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ లు కూడా 30 ఏళ్ల తర్వాతే స్టార్ డమ్ను చవిచూశారు' అంటూ తారక్ మీదున్న ప్రత్యేక అభిమానాన్ని బయటపెట్టారు కింగ్ నాగార్జున. అలాగే నాగ చైతన్య, జూనియర్ ఎన్టీఆర్ లతో గుండమ్మ కథ 'రీమేక్' ఆలోచనలు కూడా నాగార్జునకు ఉన్నట్లు టాక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement