సరికొత్త శైలిలో సుకుమార్‌తో సినిమా | NTR - Sukumar film to go to sets in April | Sakshi
Sakshi News home page

సరికొత్త శైలిలో సుకుమార్‌తో సినిమా

Jan 19 2014 12:22 AM | Updated on Sep 2 2017 2:45 AM

సరికొత్త శైలిలో సుకుమార్‌తో సినిమా

సరికొత్త శైలిలో సుకుమార్‌తో సినిమా

ఎన్టీఆర్ స్పీడ్ పెంచారు. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న ‘రభస’ (ప్రచారంలో ఉన్న టైటిల్) పూర్తి కాకముందే, మరో చిత్రానికి పచ్చజెండా ఊపేశారు.

ఎన్టీఆర్ స్పీడ్ పెంచారు. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న ‘రభస’ (ప్రచారంలో ఉన్న టైటిల్) పూర్తి కాకముందే, మరో చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. ఇంటలిజెంట్ డెరైక్టర్‌గా పేర్గాంచిన సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆయన అంగీకారం తెలిపారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్న ఈ చిత్రానికి ఏప్రిల్‌లో చిత్రీకరణ మొదలుకానుంది. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ -‘‘ఇటీవలే ఎన్టీఆర్‌కు స్టోరీ లైన్ చెబితే, ఆయన ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా వాణిజ్య అంశాలతో ఉంటూనే, సరికొత్త శైలిలో ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. తమ సంస్థలో ఇది మరో సంచలన చిత్రం అవుతుందని బీవీఎస్‌ఎన్‌ప్రసాద్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: భోగవల్లి బాపినీడు.
 

Advertisement
 
Advertisement
Advertisement