Sr NTR Talking About Backstabber Chandrababu Naidu | Lakshmi's NTR Movie Promo - Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ సం‍దేశం.. ‘వాడు గాడ్సే కన్నా అధముడు’

Mar 12 2019 11:38 AM | Updated on Mar 12 2019 2:06 PM

NTR Sandesam NTR Talks About How CBN Backstabbed Him - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ట్రైలర్లు, వీడియో సాంగ్స్‌తో సినిమా మీద అంచనాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా ఎన్టీఆర్‌ సందేశం పేరుతో మరో వీడియోను రిలీజ్ చేశారు వర్మ.

‘ఎన్టీఆర్‌ స్వయంగా చంద్రబాబు నాయుడు తనను ఎలా వెన్నుపోటు పొడిచారో చెప్పాడు’ అంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం ఆధారంగా అప్పటి ఎన్టీఆర్‌ వ్యాఖ్యలను వీడియో రూపంలో రిలీజ్ చేశారు వర్మ. ‘చంద్రబాబు వెన్నుపోటు పొడిచింది నాకు కాదు.. నాకు అధికారం ఇచ్చిన మీకు’ అంటూ ప్రజలతో ఎన్టీఆర్ తన ఆవేదనను ఎలా పంచుకున్నారు. ప్రజాస్వామ్యం బాగుండాలంటే ఎవరికి ఓటేయాలని ఎన్టీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు అన్న అంశాలను రామ్‌ గోపాల్‌ వర్మ ఆ వీడియోలో ఎన్టీఆర్‌ సందేశంగా వినిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబును ఉద్దేశింంచి ’నువ్వే మామకు వెన్నుపోటు పొడవటంలో సీనియర్వీ’ అంటూ చేసిన వ్యాఖ్యలతో రూపొందించిన ప్రొమోను సోషల్‌ మీడియాలో రిలీజ్ చేశాడు వర్మ.

రంగస్థల నటుడు పీ విజయ్‌ కుమార్‌ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో యగ్నా శెట్టి లక్ష్మీ పార్వతి పాత్రలో నటిస్తున్నారు. రామ్‌ గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కల్యాణీ మాలిక్‌ సంగీతమందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement