శ్రీనివాస కళ్యాణంలో ఎన్టీఆర్..? | NTR in Dil Raju Srinivasa Kalyanam | Sakshi
Sakshi News home page

శ్రీనివాస కళ్యాణంలో ఎన్టీఆర్..?

Sep 9 2017 10:53 AM | Updated on Sep 17 2017 6:39 PM

శ్రీనివాస కళ్యాణంలో ఎన్టీఆర్..?

శ్రీనివాస కళ్యాణంలో ఎన్టీఆర్..?

ఈ ఏడాది శతమానంభవతి, డీజే దువ్వాడ జగన్నాథమ్, ఫిదా లాంటి బిగ్ హిట్స్ అందుకున్న నిర్మాత దిల్ రాజు,

ఈ ఏడాది శతమానంభవతి, డీజే దువ్వాడ జగన్నాథమ్, ఫిదా లాంటి బిగ్ హిట్స్ అందుకున్న నిర్మాత దిల్ రాజు, ప్రస్తుతం రవితేజ హీరోగా రాజా ది గ్రేట్ సినిమాను నిర్మిస్తున్నారు. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత మరోసారి ఓ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను రూపొందించే ప్లాన్ లో ఉన్నారు దిల్ రాజు.

2017 సంక్రాంతికి శతమానంభవతితో ఆకట్టుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలోనే మరో సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే శ్రీనివాస కళ్యాణం అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడు. అయితే ముందుగా సినిమాను సీనియర్ హీరో నాగార్జునతో తెరకెక్కించాలని భావించినా.. నాగ్ అంగీకరించలేదు. దీంతో నాని, శర్వానంద్ లాంటి యంగ్ హీరోలను సంప్రదించాడట. ఫైనల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ఓకె చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement