‘సైరా’ సందడే లేదు? | No Promotions For Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy | Sakshi
Sakshi News home page

‘సైరా’ సందడే లేదు?

Jul 31 2019 10:44 AM | Updated on Jul 31 2019 11:57 AM

No Promotions For Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy - Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చిరు తనయుడు రామ్‌ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ రిలీజ్  చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతుండగా సినిమాను అక్టోబర్‌ 2న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ ప్రమోషన్‌ కార్యక్రమాలు మాత్రం ప్రారంభించలేదు. బాహుబలిని మించే సినిమా అవుతుందని ముందు నుంచే ప్రచారం జరుగుతున్నా.. సైరా విషయంలో ఆ సందడి కనిపించటం లేదు.

కేవలం పాత్రల ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌తో పాటు ఒక్క టీజర్‌ను మాత్రమే రిలీజ్ చేసిన చిత్రయూనిట్ పూర్తి స్థాయి ప్రమోషన్స్‌ ప్రారంభించలేదు. రిలీజ్‌కు కేవలం రెండు మాసాలు మాత్రమే ఉండటంతో అభిమానుల్లో టెన్షన్‌ మొదలైంది. మరి అనుకున్నట్టుగా సైరా అక్టోబర్‌ 2న రిలీజ్ అవుతుందా లేక, చిత్రయూనిట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement