నో కంపేరిజన్! | No Comparison! | Sakshi
Sakshi News home page

నో కంపేరిజన్!

Aug 22 2015 11:21 PM | Updated on Sep 3 2017 7:56 AM

నో కంపేరిజన్!

నో కంపేరిజన్!

గోపీచంద్ మంచి మాస్ హీరో... ఫ్యామిలీ హీరో. ‘లౌక్యం’తో తనలో మంచి కామెడీ టైమింగ్ కూడా ఉందని నిరూపించుకున్నారు.

గోపీచంద్ మంచి మాస్ హీరో... ఫ్యామిలీ హీరో. ‘లౌక్యం’తో తనలో మంచి కామెడీ టైమింగ్ కూడా ఉందని నిరూపించుకున్నారు. ఇప్పుడాయన కుటుంబ సమేతంగా అందరూ చూసే విధంగా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ చేస్తున్నారు. దాదాపు పదకొండేళ్ల క్రితం గోపీచంద్‌తో ‘యజ్ఞం’ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎ.యస్. రవికుమార్ చౌదరి ఈ చిత్రానికి దర్శకుడు. రెజీనా కథానాయిక. గోపీచంద్ హోమ్ బేనర్ లాంటి భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
 చిత్రవిశేషాలను రవికుమార్ చౌదరి చెబుతూ - ‘‘మా కాంబినేషన్లో వచ్చిన ‘యజ్ఞం’తో ఈ చిత్రాన్ని కంపేర్ చేయలేం. ఎందుకంటే, ఆ జానర్ వేరు.. ఇది వేరు. ఇది మంచి ఎమోషన్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. గోపి మార్క్ యాక్షన్ కూడా ఉంటుంది. ఆయన కెరీర్‌లో అత్యంత భారీ తారాగణంతో రూపొందుతున్న చిత్రం ఇదే. మళ్లీ మా కాంబినేషన్‌లో ఓ హిట్ గ్యారంటీ. ఈ చిత్రకథ, కథనం బాగా కుదిరాయి కాబట్టే, ఇంత నమ్మకంగా చెబుతున్నాను.
 
 డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రం షూటింగ్‌ని శరవేగంగా చేస్తున్నాం. ‘యజ్ఞం’తో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న గోపీచంద్, రవికుమార్‌తో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement